నందమూరి నటసింహం బాలకృష్ణకు సంబంధించిన ఒక ప్రైవేటు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా కనపడుతూ ఒక చేతిలో ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ, మరో చేతిలో ‘గ్లాస్’తో చిరునవ్వు చిందిస్తూ దర్శనమిస్తున్నారు.
బహుశా “డిక్టేటర్” సినిమా ఇచ్చిన నూతన ఉత్సాహంలో ఉన్నారేమో గానీ, ఎప్పటి మాదిరిగా చంటి పిల్లాడు మాదిరి ఎంజాయ్ చేస్తూ కనపడుతున్న ఈ ఫోటోను బాలయ్య అభిమానులు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. ఎంతటి ‘సెలబ్రిటీ’ అయినా ‘మానవ’ మాత్రుడే కదా..!
ఆనందం వస్తే సెలబ్రేట్ చేసుకోవడం, బాధొస్తే షేర్ చేసుకోవడం… ప్రస్తుత ప్రజల జీవన విధానం! దానికి బాలకృష్ణ వంటి సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా అతీతం కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఇలాంటి ప్రైవేటు పిక్స్ ను సాధారణంగా బయటకు రాకుండా కొందరు సెలబ్రిటీలు జాగ్రత్త పడుతుంటారు.
కానీ, నందమూరి నటసింహం స్టైలే వేరు కదా! దాపరికం లేని స్వచ్చమైన చిరునవ్వు బాలయ్య మోములో అభిమానులకు ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటుంది. బహుశా అలాంటి సందర్భంలోని ఒక ఫోటోనే ఇది అయ్యుంటుంది అని నందమూరి అభిమానులు చెప్తున్న మాట.





