అన్నగారి బయోపిక్ ని తెరకెక్కించే క్రమంలో నందమూరి బాల కృష్ణ ‘ఎన్.బీ.కే ‘ బ్యానర్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ బ్యానర్ లో ఎన్ఠీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన తర్వాత వెంటనే బోయపాటితో మరో సినిమా తీస్తున్నట్లు బాలయ్యనే స్వయంగా ఎన్ఠీఆర్ బయోపిక్ ఆడియో వేడుకపై తెలిపాడు.
అయితే ఇదిలా ఉంటే బాలయ్య 100 వ సినిమా సమయంలో యువ దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా ఉండబోతుంది అని తెలిసిన విషయమే. కానీ అటు బాలయ్య..ఇది అని రావిపూడి ఇద్దరూ బిజీ అయిపోవడం వల్ల..ఆ సినిమాపై పెద్దగా వార్తలు లేవు..కానీ అనిల్ చెప్పిన కదా నచ్చడంతో బాలయ్యే స్వయంగా ఆ కథతో సినిమా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు అదీ..తన సొంత బ్యానర్ అయిన ‘ఎన్.బీ.కే ‘లో చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడట..
అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అసలు ఈ కథను అని రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో చెయ్యాలి అని అనుకున్నాడు…కానీ అది ఒకప్పటి మాట…ఇప్పుడు బాలయ్యే స్వయంగా నేనే నిర్మిస్తా అంటూ ఉంటే…అనిల్ మాత్రం ఏమంటాడు..”సరే బాబు” అని అనడం తప్ప…
ఏది ఏమైనా..అన్నీ అనుకున్నట్లే జరిగితే మాత్రం..బాలయ్య బ్యానర్ లో మరి సినిమా షురూ అయిపోయినట్లే.



