‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’గా ప్రసారం అవుతోన్న నందమూరి నటసింహం బాలకృష్ణ షో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వారం రిలీజ్ అయిన రానా – బాలయ్యల ఎపిసోడ్ కూడా అదిరిపోవడంతో, ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న మహేష్ బాబు – బాలకృష్ణల ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.
సంక్రాంతి పర్వదినం కానుకగా ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందేమోనని ఇప్పటివరకు భావించగా, తాజాగా ‘ఆహా’ ఇచ్చిన అప్ డేట్ తో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి. సంక్రాంతి స్పెషల్ గా మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మరియు హీరో విజయ్ దేవరకొండ, ఛార్మిలతో ఉంటుందని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి స్పష్టత ఇచ్చారు.
దీంతో నిరుత్సాహపడడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వంతవుతున్నా, క్రేజీ హీరో ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ ఉండడం స్పెషల్ గా మారింది. అలాగే బాలయ్యతో ‘పైసా వసూల్’ తీసిన పూరీ జగన్నాధ్ మరోసారి నందమూరి నటసింహం కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారనే టాక్ ఇటీవల రావడంతో, దీనిపై కూడా ఈ షోలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అలాగే సినీ పరిశ్రమకు – డ్రగ్స్ కు సంబంధించిన అంశాలలో పూరీ పేరు వినపడింది గనుక, ఇటీవల రవితేజను అడిగినట్లే, డ్రగ్స్ కేసు అంశాలు కూడా బాలయ్య ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ప్రోమోను అతి త్వరలోనే విడుదల చేస్తామని ‘ఆహా’ ప్రకటించింది.
Iss Sankranthi..Hum Vaat Laga Denge! 🤙
Rowdy @TheDeverakonda and his Team #Liger joins #NandamuriBalakrishna on #UnstoppableWithNBK.
Episode 9 Premieres January 14.
Promo soon.@purijagan @Charmmeofficial pic.twitter.com/IXU9Fjx6VN
— ahavideoin (@ahavideoIN) January 8, 2022



