ఆ హీరో డైలాగ్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్!

Nani did not watched Jr NTR Bigg Boss telugu season 1‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ ఏ రేంజ్ లో ప్రజాధరణ పొందిందో తెలిసిందే. అప్పటివరకు ఉన్న టీఆర్పీ రికార్డులను బ్రేక్ చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఒంటి చేత్తో షోను నడిపించిన విధానం సర్వత్రా ప్రశంసలు పొందింది. పలువురు సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ హోస్టింగ్ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ… అదరగొట్టేసాడంటూ అభినందనలు తెలియజేసారు. అలాంటి షోను నాని ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదట.

ADVERTISEMENT

అవును… స్వయంగా నానినే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘బిగ్ బాస్’ రెండవ సీజన్ ప్రారంభం కాబోతోన్న నేపధ్యంలో ప్రెస్ మీట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఈ విషయాన్ని తెలిపారు. ‘ఎక్కడ చూసినా ఇదే చెప్తుంటారని, లాస్ట్ సీజన్ లో తారక్ ఇరగ్గొట్టేసాడని, ఇప్పుడు దాన్ని రీచ్ కావడం చాలా అసాధ్యమని, అయినప్పటికీ తన వంతు కృషి చేస్తానని, ఎలా చేస్తాను అనేది ఇప్పటివరకు తనకు తెలియదని, తారక్ చేసిన ఎపిసోడ్స్ ను హాట్ స్టార్ లింక్స్ తెప్పించుకుని చూస్తానని’ నాని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ గురించి ఎలాంటి వ్యతిరేక భావన వ్యక్తం చేయలేదు, అలాగే ఎలాంటి ప్రశంస కురిపించలేదు, కానీ అంత బాగా చేసిన సీజన్ లో కనీసం ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పడం నిజమేనా? అన్నది అభిమానులు కలత చెందుతున్న విషయం. ఎందుకంటే ‘బిగ్ బాస్’లో తారక్ ఇరగదీసాడని, అలా తాను చేయలేనని, అందుకే ఇలాంటి షోలకు తాను దూరం అంటూ స్వయంగా ప్రిన్స్ మహేష్ బాబు గతంలో తెలిపారు. మరి నాని ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదా? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories