జూనియర్ ఎన్టీఆర్ తర్వాత నానికే!

Nani in three different getupsకమర్షియల్ పంథాలో వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోన్న ‘నాచురల్ స్టార్’ నాని, తన నటనకు పదును పెట్టే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో నాగ్ తో కలిసి ‘దేవదాస్’ అనే మల్టీస్టార్ సినిమా చేస్తుండగా, ఈ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇక నాని హోస్ట్ గా చేస్తోన్న ‘బిగ్ బాస్ 2’ కూడా ముగింపు దశకి చేరుకుంటోంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాగానే నాని, తన తదుపరి చిత్రంగా “జెర్సీ”ని మొదలుపెట్టనున్నాడు.

[m9ad]

ADVERTISEMENT

క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడని తెలుస్తోంది. అందులో ఒకటి యువకుడిగా… మరొకటి మధ్య వయస్కుడిగా… ఇంకొకటి వృద్ధుడిగా మూడు దశలలో తెరపై కనిపించనున్నాడని సమాచారం. నటనకి మంచి స్కోప్ ఉండటంతో నాని ఈ సినిమాపై ఎంతో ఆసక్తితో, మరెంతో ఉత్సాహంతో వున్నాడని చెబుతున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించే ఈ సినిమాకి, గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. మూడు పాత్రలలో కాకపోయినా, ఒకే సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ తో కనిపించి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు నాని. ఈ తరం హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ‘జై లవకుశ’ సినిమాలో మూడు విభిన్న పాత్రలను పోషించి ఫ్యాన్స్ ను అలరించాడు. బహుశా తారక్ తర్వాత నాచురల్ స్టార్ కే ఈ అవకాశం దక్కిందేమో!

ADVERTISEMENT
Latest Stories