నాని నెత్తిన పాలు పోసిన శ్రీరెడ్డి!

Nani + Sri Reddy = 'Dirty Picture'నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కాబోయే ‘బిగ్ బాస్ 2’లో సంచలనాల శ్రీరెడ్డి కూడా భాగస్వామ్యం కాబోతోందని ఇటీవల జరిగిన ప్రచారం తెలిసిందే. ముఖ్యంగా శ్రీరెడ్డి చేసిన ట్వీట్స్ ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చాయి. అయితే తాజాగా స్పందిస్తూ “ఇది నా దురదృష్టం… నా స్నేహితులకు చేదు వార్త… నేను ‘బిగ్ బాస్ 2’లో పాల్గొనడం లేదు. ఇది నా సన్నిహితులను అప్సెట్ చేసినా, కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పోటీదారులు అదృష్టవంతులు… ‘బిగ్ బాస్ 2’ బృందానికి ఆల్ ది బెస్ట్” అంటూ ఫేస్ బుక్ వేదికగా స్పందించింది.

ADVERTISEMENT

ఈ మాటలు ఎవరికీ ఎలా ఉన్నా నాని నెత్తిన పాలు పోసినట్లే భావించవచ్చు. ఒకవేళ ‘బిగ్ బాస్ 2’లో శ్రీరెడ్డి ఉంటే వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను ఊహించలేం కూడా! 16 మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు జరగబోయే ‘బిగ్ బాస్ 2’లో ఇంతవరకు ఎవరెవరూ పాల్గొనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ 16 మంది సభ్యుల మధ్య అనునిత్యం చోటుచేసుకునే ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సారి సన్నివేశాలను ఇంకొంచెం మసాలాలో ఉండేలా చూస్తానని నాని చెప్పడంతో, ఈ సారి ‘బిగ్ బాస్’ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories