‘దసరా’ మూవీ తో నాని లుక్ ను మార్చిన శ్రీకాంత్ ఓదెల, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ మూవీ తో నాని సినీ కెరీర్ ను కూడా మార్చబోతున్నారా అనేలా ఉంది నాని ది ప్యారడైజ్ గ్లిమ్స్.
రా…స్టేట్మెంట్ అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ గ్లిమ్స్ చూడడానికే కాదు వినడానికి కూడా ‘రా’ గానే ఉంది. ఇది కడుపు మండిన కాకుల కథ..జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ…నా కొడుకు నాయకుడు అయిన కథ…అంటూ ఒక తల్లి తన కొడుకు గురించి ‘రా’ గా వర్ణించే విధానం చాల గంభీరంగా కనిపిస్తుంది.
ఆకలి, కష్టాలు, అణిచివేతలకు గురైన ఒక కాకుల జాతి కోసం నాయకుడిగా మారిన ఒక వ్యక్తి పోరాటం ది ప్యారడైజ్ కథగా అనిపిస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ లో నాని లుక్స్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. నాని గత సినిమాలతో పోలిస్తే ఇది నానికే కాదు తెలుగు ఆడియెన్స్ కూడా ఒక కొత్త అనుభూతనే తీసుకొచ్చిందని చెప్పాలి. కేవలం మాస్ లుక్ అనే కాదు నాని కనిపించిన విధానం మాస్ కి మించి అనేలా ఉంది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈ సారి తన సినిమాలతో కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్ కు దూరమయ్యారనిపిస్తుంది. కేజిఫ్ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ అంచలంచలుగా తన పరిధిని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానిని తాకినట్టుంది. రెండు రోజుల క్రితం హిట్ -3 తో పోలీస్ ఆఫీసర్ వైలెన్స్ ను చూపించిన నాని ఇప్పుడు మరో జోనర్ తో గ్లిమ్స్ ని ఎరుపెక్కించారు.
అయితే ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2026 మార్చి 26 న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ కొత్త ట్రెండ్ నానికి కొత్త ఇమేజ్ తీసుకువస్తుందేమో చూడాలి.




