గనులు త్రవ్వి ఎలుకను పట్టిన పవన్ కళ్యాణ్?

Nara Lokesh tweet response to pawan kalyanతెలుగుదేశం ప్రభుత్వం… చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర టిడిపి నేతలపై… గట్టిగట్టిగా అరుస్తూ… ఊగిపోతూ…. ఉద్వేగానికి గురవుతూ విమర్శలు చేస్తుండడం జనసేన అధినేత వంతవుతుంటే, సైలెంట్ గా… నింపాదిగా… అందుకు తగ్గ రీతిలో జవాబులు ఇస్తూ సమాధానాలు చెప్పడం తెలుగుదేశం నేతల వంతవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

[m9ad]

“గనులు త్రవ్వి ఎలుకను పట్టారా పవన్ గారూ?” అంటూ వంతాడ గనుల త్రవ్వకంపై పవన్ చేసిన విమర్శలకు లోకేష్ బదులిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన లీజులను తమ మీదకు రుద్దడం, వాటికి టిడిపిని బాధ్యులని చేయడం ఎలా జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్, ఆ అక్రమ లీజులను 2015లోనే రద్దు చేసిన కాపీని ఇందుకు జత పరుస్తున్నానని సాక్ష్యాలను కూడా చూపించారు.

ఒక బాధ్యత గల పార్టీ అధినేతగా పవన్ మారాలని, ఎవరో ఏదో చెప్తే విన్నాను, అదే నేను మాట్లాడాను అంటే కుదరదని ఒక విధమైన హెచ్చరికలు పంపిన లోకేష్, ఢిల్లీ నుండి ఎవరో ఏదో చేయమంటే చేయకుండా, పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందించడం నిజమైన నాయకుడు లక్షణంగా అభివర్ణించారు. మొత్తమ్మీద మీరు చేసిన “గనులు తవ్వి ఎలుకను పట్టినంత” హాస్యాస్పదంగా ఉందని కౌంటర్లు వేసారు లోకేష్. నిర్మాణాత్మకమైన ఈ

ADVERTISEMENT
Latest Stories