లోకేష్ పనితనానికి ప్రచారం చేసిన జగన్ యంత్రాంగం

Nara Lokesh village level reforms 15 awardsగ్రామీణ స్థాయి సంస్కరణలకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులలో ఏకంగా పదిహేను అవార్డులు లభించాయని ఒక వార్త వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికార యంత్రాంగం నుండి ఆ పార్టీ సోషల్ మీడియా సెల్ వరకు ఫుల్ జోష్ తో ఈ వార్త గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు.

అయితే ఆ తరువాత నాలుక కార్చుకున్నారు. ఈ వార్త ఇప్పటిదే అయినప్పటికీ 2018-19 నాటి పెర్ఫార్మన్స్ గురించి ఇచ్చిన అవార్డులను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఆ సదరు శాఖకు లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన అవార్డులు కావడం విశేషం.

ADVERTISEMENT

ఒక రకంగా లోకేష్ పనితనం గురించి టీడీపీ వారు కూడా చెప్పుకోవడానికి విఫలం అయ్యాం అని భావిస్తున్న తరుణంలో జగన్ యంత్రాంగం లోకేష్ పనితనానికి ప్రచారం చేసినట్టు అయ్యింది. దీనితో వారు కొంత ఇబ్బంది పడి వెంటనే తమ కాంపెయిన్ ను రద్దు చేసుకున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఈ సంఘటనను ఎంజాయ్ చేస్తూ… వైఎస్సార్ కాంగ్రెస్ వారిని ఇబ్బంది పెడుతున్నారు. వచ్చే ఏడాది అవార్డులతో మీ టాలెంట్ ఏంటో తేలిపోతుంది.. అప్పుడు చూసుకుందాం అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories