లోకేష్ వ్యూహం ఫలించినట్టేనా..?

Nara Lokesh

వివాదాల దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే సినిమాలతో ప్రజల ముందుకొస్తారు. గత ఎన్నికల
ముందు కూడా టీడీపీ, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు, లోకేష్, పవన్ లను కించపరిచేలా టీడీపీ పార్టీ అధికారంలో ఉండగానే చిత్రాన్ని రూపొందించారు, విడుదల కూడా చేశారు.

అయితే చంద్రబాబుకి ఉన్న పట్టువిడుపులు మనస్తత్వంతో ఆర్జీవీ ఈసాహసం చేశారనే చెప్పాలి. తాజాగా రిలీజ్ అయినా పవన్ బ్రో సినిమాలో శ్యాంబాబు అనే క్యారెక్టర్ తనను పోలివుందని, అది తనను కించపరచడమే అవుతుందని మంత్రి రాంబాబు మీడియా ముందుకొచ్చి తెలుగు సినిమా దర్శకులకు, రచయితలకు,నటీనటులకు ఏకంగా హెచ్చరికలు జారీచేశారు కూడా. అదే జగన్ కు వ్యతిరేకంగా సినిమా రూపొందితే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకోవాలి.

ADVERTISEMENT

జగన్ కు వ్యతిరేకంగా కాదు కదా కనీసం జగన్ ను వ్యతిరేకిస్తున్న పవన్ సినిమా విడుదలకు ఏపీలో ఎన్నిఅడ్డంకులు సృష్టిస్తుందో ఈ ప్రభుత్వం అందరికి తెలిసిందే. కానీ రాష్ట్రంలో అధికార పార్టీకి మద్దతుగా జగన్ కు విధేయుడిగా చెప్పబడే ఆర్జీవీ ఇప్పుడు వ్యూహం సినిమాతో తన పైశాచికత్వాన్ని ప్రజలపై రుద్దడానికి సిద్ధమయ్యారు. తనకు నచ్చిన వ్యక్తిని హీరోగా చూపించుకోవడాన్ని ఎవరు తప్పుబట్టారు. కానీ తనని హీరోగా మార్చచడానికి సమాజంలో తనకంటూ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న మరికొందరిని కించపరచాల్సిన అవసరం లేదు అనేదే ఇక్కడ వాదించబడే అంశం.

ఈ నేపథ్యంలో లోకేష్ వ్యూహం సినిమా పై తన అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాశారు.దీనితో సెన్సార్ బోర్డు ఈచిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ నా సినిమాను ఎవ్వరు ఆపలేరు, ఈ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే హైకోర్టుకు వెళ్తాను, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అంటూ X మాధ్యమం లో ఒక పోస్టు పెట్టారు.

తెలుగు సినీ నిర్మాతల మండలి సభ్యుడైనా నట్టి కుమార్ కూడా ఈ విషయంలో స్పందిస్తూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీచేసే వారిలో నటి జీవిత పాత్ర కూడా ఉండడంతో ఆమె వైసీపీ పార్టీకి మద్దతురాలుగా ఉంటుందని ఆ కారణంగా ఆమెను ఆ బాధ్యతల నుండి తప్పించాలంటూ నట్టికుమార్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై జీవిత స్పందిస్తూ తనకు వైసీపీ కి ఎటువంటి సంబంధం లేదని అన్ని సినిమాల మాదిరే ఈ సినిమాను కూడా చూసి సర్టిఫై చేస్తామని తెలిపారు.

ఒక్కలోకేష్ లేఖ ఇన్ని వివాదాలను సృష్టించి వివాదాల దర్శకుడికే వివాదాన్ని తీసుకువచ్చింది. మొత్తానికి వ్యూహం పై లోకేష్ వ్యూహం ఫలించినట్టే కనపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories