నారా లోకేష్‌ కొత్త ఆలోచన: మైటీడీపీ యాప్‌.. 10 లక్షల మంది నమోదు!

Nara Lokesh's My TDP App: A Digital Link to 10 Lakh Members

దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మాకు నేతలు కాదు కార్యకర్తలే ముఖ్యం అని చెప్పుకుంటాయి. కానీ గ్రామస్థాయిలో పార్టీ జెండాలు మోసే కార్యకర్తలను పట్టించుకునే పార్టీలు చాలా అరుదు.

వైసీపీ హయంలో కార్యకర్తలు పక్కన పెట్టి వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలే ముఖ్యమంటూ ఆ పార్టీ అధినేత మాట్లాడటం అందరికీ తెలిసిందే.

ADVERTISEMENT

కానీ టీడీపి ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సాంకేతికంగా అప్‌డేట్‌ అవుతూ, కార్యకర్తలతో అనుసంధానం అవుతోంది.

గ్రామ స్థాయి కార్యకర్తలను పార్టీ అధిష్టానాన్ని అనుసంధానం చేస్తూ మంత్రి నారా లోకేష్‌ ‘మైటీడీపీ’ అనే మొబైల్ యాప్ ప్రవేశపెట్టారు.

దానికి కార్యకర్తల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. అందువల్లే ఇప్పుడు మైటీడీపీ యాప్‌లో పది లక్షల మంది సభ్యులు నమోదు అయ్యారు. తెలుగుదేశం పార్టీ డిజిటల్ ప్రయాణంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుంది.

మై టీడీపీ యాప్ ఏవిధంగా పనిచేస్తుందంటే, గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు తమ వివరాలు, నిర్వహించిన పార్టీ, సేవా కార్యక్రమాలు, వాటికి సంబంధించి ఫొటోలు వంటి సమస్త సమాచారాన్ని నేరుగా యాప్‌లో నమోదు చేస్తున్నారు. వాటితో పార్టీ నాయకత్వం కార్యకర్తల పనితీరుని అంచనా వేయగలుగుతోంది.

పార్టీ కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించడంలో ఈ డిజిటల్ వ్యవస్థ కీలకంగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ విధంగా కష్టపడే కార్యకర్తలకు కార్పొరేటర్లు, సర్పంచ్‌ పదవులు లభించాయి. మున్ముందు పార్టీ, నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో కూడా కార్యకర్తలకు అవకాశాలు లభించే అవకాశం ఉంది.

అలాగే మైటీడీపీ యాప్ ద్వారానే పార్టీ నాయకత్వం ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చేరుతోంది. వాటిపై మళ్ళీ వారి అభిప్రాయాలు తెలిపే అవకాశం కూడా ఏర్పడింది. ఇవికాక స్థానికంగా ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి సమాచారం కూడా వెంట వెంటనే పార్టీ నాయకత్వానికి చేరుతోంది. అంటే అధిష్టానానికి, గ్రామ స్థాయి కార్యకర్తలకు మధ్య ఈ మైటీడీపీ యాప్ ఒక వారధి వంటిదన్న మాట!

మైటీడీపీ యాప్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ ‘ఫొటో బూత్’. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పర్యటనల సందర్భంగా కార్యకర్తలతో దిగిన ఫొటోలను వారికి నేరుగా అందించేలా ఈ సదుపాయాన్ని రూపొందించారు. ఈ యాప్‌లో ఒకసారి ముఖాన్ని స్కాన్ చేసుకుంటే, ఆ తర్వాత దిగిన సంబంధిత ఫొటోలు ఫొటో బూత్ విభాగంలో కనిపించేలా ఏర్పాటు చేశారు.

‘డిజిటల్ మహానాడు’ మరో కొత్త ఆలోచనే. దీనిలో కార్యకర్తల నమోదు, హాజరు, సమావేశాలు, శిక్షణా తరగతుల నిర్వహణలో డిజిటల్ విధానాలను ఉపయోగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా యాప్‌లో సదుపాయాలు కల్పించారు.

అంతేకాదు ఈ యాప్ ద్వారా అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసే కార్యకర్తలను నారా లోకేష్ పర్యటనలలో కలిసి అభినందించి ప్రశంసాపత్రాలు కూడా అందిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

మైటీడీపీ వినియోగం, పార్టీ కార్యక్రమాల నమోదు విషయంలో నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల విభాగంలో కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం ముందంజలో ఉన్నాయి.

ఈ మై టీడీపీ యాప్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని కార్యకర్తలు దీనిలో తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కనుక దేశంలో ఇతర పార్టీలకు టీడీపీ మాత్రమే కాదు ఈ ‘మై టీడీపీ యాప్’ కూడా స్పూర్తిదాయకంగానే నిలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories