అఖిల్ మీద నాగ్ పంచ్… నిజమే కదా..!

Nargarjuna-Comments-On-AKhil-Akkineniఅఖిల్ తొందరపడ్డాడు… పెద్దోళ్ళ మాటలు వింటే బాగుంటుంది… ఏది ఎవరో బయట వ్యక్తి అన్న మాటలు కాదు. అఖిల్ తండ్రి కింగ్ నాగార్జున స్వయంగా తన తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ద్వారా అఖిల్ పరిచయం చేయబోతున్నారా? అని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నకు కింగ్ తనదైన శైలిలో జవాబిచ్చి నవ్వులు పూయించాడు.

[m9ad]

ADVERTISEMENT

టాక్స్ జరిగిన మాట వాస్తవమేనని, అఖిల్ అంటే కరణ్ జోహార్ కు చాలా ఇష్టమని, తాను ఇంట్రడ్యూస్ చేస్తానని రెండు, మూడు సార్లు అడిగాడని, అయితే ఇప్పుడే తొందరపడవద్దని, ఇప్పటికే అఖిల్ ఒకసారి తొందరపడ్డాడని, పెద్దోళ్ళ మాటలు వింటే బాగుంటుంది… కనీసం ఇలాంటపుడైనా… అని చెప్పగానే నాగ్ తో సహా అక్కడున్న మీడియా ప్రతినిధులంతా నవ్వేసారు.

సొంత కొడుకుపైనే నాగ్ పంచ్ వేయడం అనేది ఎవరూ ఊహించనిది. నాగ్ స్టైల్ అంతే! అందుకే అభిమానులు ఈ ‘మన్మధుడు’ని అమితంగా ఇష్టపడుతుంటారు. “దేవదాస్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కధాకమామీషు జరిగింది. ఇంతకీ అఖిల్ పైన నాగ్ వేసిన పంచ్ కు అర్ధం ఏమిటో అర్ధం అయ్యిందా? అర్ధం అయితే నిజమే కదా! అనుకుంటారు.

ADVERTISEMENT
Latest Stories