లేటెస్ట్ ట్విస్ట్ : టికెట్ ధరలకు 10 రోజుల డెడ్ లైన్!

లేటెస్ట్ ట్విస్ట్ : టికెట్ ధరలకు 10 రోజుల డెడ్ లైన్!సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండస్ట్రీ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ వంటి పలువురు హీరోలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు వ్యక్తం చేసారు.

ఇదిలా ఉంటే ఈ పెంచిన సినిమా టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం తగ్గించాలంటూ నిర్మాత నట్టి కుమార్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఇందుకు 10 రోజుల డెడ్ లైన్ ను కూడా విధించారు. ఒకవేళ అప్పటికి నిర్ణయం తీసుకోకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా చెప్పారు.

ADVERTISEMENT

ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ధియేటర్లన్నీ వరుసగా మూతపడుతుంటే, ఇప్పుడు తెలంగాణాలో కూడా పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? బహుశా ఏపీలో మాదిరే తెలంగాణాలో కూడా ధియేటర్లన్నీ మూతపడిపోవాలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఒకప్పుడు “ఆ నలుగురు” అంటూ మీడియా ముందు హల్చల్ చేసిన నట్టి కుమార్, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వంత పాడుతున్నారు. అయితే ఇది నట్టి కుమార్ సొంత అభిప్రాయమా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో కూడా ట్రేడ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.

ఏపీ సర్కార్ మాదిరి కేసీఆర్ ప్రభుత్వం ఇండస్ట్రీ వర్గాలను ఇబ్బంది పెట్టడం లేదన్న విషయం బహిరంగమే. అలాగే నట్టి కుమార్ లాంటి తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ సర్కార్ దిగి రావడం కూడా అసంభవం. మీడియాలో కాసేపు హల్చల్ చేయడానికి తప్ప ఇలాంటి వార్తలకు పెద్దగా ప్రాధాన్యం దక్కదు గానీ, ఏపీలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ వార్త ప్రముఖమైంది.

ADVERTISEMENT
Latest Stories