నాని ట్రైలర్ లో ‘సెన్సిటివ్’ సస్పెన్స్!

Nani Shyam Singha Royనాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న “శ్యామ్ సింగరాయ్” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఇటీవల పెద్ద సినిమాల ట్రైలర్స్ విషయంలో జరుగుతోన్న జాప్యత నాని “శ్యామ్ సింగరాయ్”లోనూ జరిగింది. సాంకేతిక కారణాల పేరుతో ఆలస్యంగా విడుదలైన ట్రైలర్, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో, మొత్తానికి చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

24వ తేదీన సిల్వర్ స్క్రీన్ పై ఏం చూపించాలనుకుంటున్నారో ఈ 110 సెకన్ల ట్రైలర్ లో దాదాపుగా చెప్పేసారు. అలాగే సినిమాలో ఉండే “సస్పెన్స్”ను ట్రైలర్ లో కూడా మైంటైన్ చేసారు. సినిమా డైరెక్టర్ కావాలనే తలంపుతో ఉన్న వ్యక్తిగా మరియు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే శ్యామ్ సింగరాయ్ గా నాని లుక్స్ అభిమానులను, ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయి.

ADVERTISEMENT

‘ఉప్పెన’ సినిమాతో యువత హృదయాలు దోచుకున్న కృతి శెట్టి సిగరెట్ తాగుతూ ప్రేక్షకులకు షాక్ ఇవ్వగా, ఫ్లాష్ బ్యాక్ లో ‘దేవదాసి’గా సాయిపల్లవి క్యారెక్టర్ హైలైట్ కాబోతోందని చెప్పకనే చెప్పారు. అయితే సినిమా డైరెక్టర్ గా పని చేసే నానికి – శ్యామ్ సింగరాయ్ గెటప్ లో ఉన్న నానికి లింక్ ఏమిటన్నది సస్పెన్స్ గా మారింది. ట్రైలర్ లో దీనికి కాస్త సైంటిఫిక్ టచ్ ఇచ్చారు గానీ, ట్విస్ట్ మాత్రం రివీల్ చేయలేదు.

ఆ ట్విస్ట్ గనుక తెరపై సరిగ్గా పండి, క్లైమాక్స్ ను సరిగ్గా తీర్చదిద్దగలిగితే, “ఈ క్రిస్మస్ మనదే” అంటోన్న నాని మాటలు నిజం కావడం తధ్యం. పునర్జన్మలు – సైంటిఫిక్ థీరీస్, ప్రేక్షకుల దృష్టిలో ఈ రెండు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్స్. సరిగ్గా డీల్ చేస్తే ఓ ‘మగధీర, గజినీ, మనం’ లాంటి క్లాసిక్స్ అవుతాయి, లేదంటే ‘శక్తి, 24’ మాదిరి మిగిలిపోతాయి.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లోని ప్రతి షాట్ లో కనపడుతున్నాయి. ఒక్క హిందీ తప్ప దక్షిణాది భాషల్లో రిలీజ్ అవుతుండడం “శ్యామ్ సింగరాయ్” మరో ప్రత్యేకత.

ADVERTISEMENT
Latest Stories