మరీ ఇంత “అతి” అవసరం లేదేమో!

nawab-simbu-fan-momentతమిళ ప్రేక్షకులు చూపించే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవుళ్ళతో సమానంగా దేవాలయాలు నిర్మించి పూజించే రకం తమిళ ప్రేక్షకులది. అలాంటి ఫ్యానిజం మరో రూపు దాలిస్తే ఎలా ఉంటుందో చెప్పే విధంగా, గత నాలుగైదు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

[m9ad]

ADVERTISEMENT

తెలుగులో “నవాబ్”గా విడుదలైన తమిళ చిత్రంలో శింబు ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఓ ధియేటర్ వద్ద శింబుకు పాలాభిషేకం చేయడానికి ఓ అభిమాని సాహాసించాడు. తన శరీరానికి కొంకాలు తగిలించుకుని, క్రేన్ సాయంతో ఆ భారీ కటౌట్ వద్దకు చేరుకొని పాలాభిషేకం చేసి, తమిళ అభిమానం అంటే ఏమిటో రుచిచూపించాడు.

అయితే దీనిపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అభిమానం ఎంతైనా ఉండొచ్చు గానీ, ప్రదర్శించే విధం మాత్రం ఇది కాదన్న విమర్శలే ఎక్కువగా వినపడుతున్నాయి. దీన్ని చూసి మరో హీరో అభిమాని ఇంకో విధంగా ప్రయత్నాలు చేయడం… ఇలా జరగరానిది ఏదైనా జరిగితే, ఆ “అనర్ధం” మాటలకందకుండా ఉంటుందని సదరు అభిమానులు కూడా గ్రహించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories