dhanush-nayanathara

నయనతార, ధనుష్ ఇద్దరూ కోలీవుడ్‌లో అగ్రనటీనటులే. వారిద్దరి మద్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది. నయనతార బహిరంగ లేఖతో అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చేసి వైరల్ అవుతోంది. అదేమిటో చూద్దాం.

నయనతార వ్యక్తిగత, సినీ జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ తీసింది. అది ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ఇటీవలే దాని ట్రైలర్‌ విడుదలైంది.

Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?

అది విడుదల కాగానే ధనుష్ ఆమెకు లీగల్ నోటీస్‌ ఇచ్చారు. దానిపై ఆమె స్పందిస్తూ ధనుష్ పేరిట ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆమె ఏమన్నారంటే, “సినీ పరిశ్రమలో మీరు మీ తండ్రి, సోదరుడు ఆశీర్వాదాలతో ఈ స్థాయికి చేరుకోగా, నాకు పరిశ్రమలో ఎవరూ పెద్దదిక్కు లేకపోయినా నా ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నాను.

Also Read – ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా!

నెట్‌ఫ్లిక్స్‌లో నాపై డాక్యుమెంటరీ తీయాలని రెండేళ్ళుగా మేమందరం ఎంతో కృషి చేస్తున్నాము. దానిలో నేను నటించిన అనేక చిత్రాలలో ఒకటైన ‘నానుం రౌడీ దాన్’ (తెలుగులో నేను రౌడీ) క్లిప్పింగ్స్ కూడా పెట్టాలనుకుని అందుకు మీ అనుమతి కోరితే, నా పట్ల, నా భర్త పట్ల మీకు గల ద్వేషభావంతో నిరాకరించారు.

కనీసం ఆ సినిమాలో పాట క్లిప్పింగ్ వాడుకునేందుకు అనుమతి కోరినా మీరు ఇవ్వలేదు. నా సినీ కెరీర్‌లో నాకు ఎంతో మంచి పేరు తెచ్చిన, నాకు ఎంతో నచ్చిన ఆ సినిమాని నా డాక్యుమెంటరీకి వాడుకోవద్దన్నప్పుడే నాకు చాలా బాధ కలిగింది.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

ఒకవేళ దాని వలన మీకు ఆర్ధికంగా నష్టం వచ్చినా లేదా మరేదైనా ఇబ్బంది కలిగినా అభ్యంతరం చెపితే అర్ధం ఉంది. కానీ 2016లో విడుదలైన ఆ సినిమా పూర్తిగా మీడియా, సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉంది.

వాటి నుంచి మా కెమెరాతో కేవలం 3 సెకన్ల నిడివి కలిగిన చిన్న బిట్ తీసుకొని నా డాక్యుమెంటరీలో పెట్టినందుకు నాకు లీగల్ నోటీస్‌ పంపడం చాలా దుర్మార్గం. ఆ మూడు సెకన్ల బిట్‌ పెట్టినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని కోరుతూ నాకు లీగల్ నోటీస్‌ పంపించడం మీ నీచమైన గుణానికి అద్దం పడుతోంది.

ఆ సినిమా విడుదకు ముందు మీరు దాని గురించి నాతో ఎంత చెడ్డగా మాట్లాడారో నాకు గుర్తుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి మీరు నాపై, విగ్నేష్ శివన్‌పై అసూయతో బాధపడుతూ మా పట్ల ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.

కాపీ రైట్ చట్టం క్రింద మీకు ఆ సినిమాపై సర్వ హక్కులు ఉన్నాయి కనుక కోర్టులో మీరు నెగ్గవచ్చు కానీ నైతిక విలువలనేవి కూడా ఒకటున్నాయని గ్రహించండి. పైన దేవుడి కోర్టులో నా వాదనే సరైనదని తేలుతుంది.

ఓ సినిమాకి మీరు నిర్మాతగా ఉంటే దానికి చక్రవర్తిని అనుకుంటున్నారా? మీ నిరంకుశత్వ ఆదేశాలకు యూనిట్‌లో అందరూ తూచా తప్పకుండా పాటించవలసిందేనా?మీరు నిర్మాత అయితే ఆ సినిమా కోసం పనిచేసిన వారందరి జీవితాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా?వారి జీవితాలతో ఆడుకుంటారా?




సినీ ప్రమోషన్స్‌లో వేదిక మీద మిమ్మల్ని మీరు చాలా గొప్పగా ఊహించుకుంటూ మాటలాడుతూ మీ అమాయక అభిమానులను మభ్యపెడుతుంటారు. కానీ మీరు అనుకుంటున్న దానిలో సగం కూడా లేరు మీరు. వేదికల మీద మీరు చెప్పే మాటలకు, నిజజీవితంలో చేసే పనులకు ఎక్కడ పొంతన ఉండదని ఈ లీగల్ నోటీస్‌ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. మీ గురించి తమిళనాడు ప్రజలందరికీ తెలియజేయాలనే నేను ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నాను,” అని నయనతార ధనుష్ తీరుని తప్పు పడుతూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు