నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఇప్పటివరకు రెండు మూడు పోస్టర్ల మాత్రమే విడుదల చేశారు. ఆ పోస్టర్లు కూడా పెద్దగా ఏమీ లేవు. అభిమానులు కూడా పెద్దగా ఎక్సైట్ కాలేదు. అయినా చిత్రం బిజినెస్ బానే నడుస్తుంది.
ఏషియన్ సినిమాస్ సినిమా నైజాం హక్కులను, ఉషా పిక్చర్స్ సినిమా పశ్చిమ గోదావరి హక్కులను చేజిక్కించుకున్నారు. ఈ ఇద్దరూ సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు సీనియర్లు కావడంతో సినిమా కాంపిటీషన్ లో విడుదలైన మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. కనీసం టీజర్ కూడా విడుదల కాకముందే బిజినెస్ ప్రారంభం కావడంతో నందమూరి అభిమానులు హుషారుగా ఉన్నారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు. ఇప్పటివరకూ దాదాపుగా అరడజను పైగా సినిమాలు తాము క్రిస్మస్ కు వస్తున్నట్టుగా ప్రకటించాయి. నవంబర్ లో ఏవి పోటీలో ఉంటాయి అనే దాని మీద క్లారిటీ రావొచ్చు.
సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య వందవ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణికి స్వరాలు కూర్చిన చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు.





