“మహానటి” మొత్తాన్ని రెండే సీన్స్ లో !

negatice shade of Savithri Character in NTR Biopicఎన్ఠీఆర్ కథానాయకుడు సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతుంది. అయితే మరో పక్క ఈ సినిమాలో హైలైట్స్ గురించి…హైలైట్ సీన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో సావిత్రి సీన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే.

ADVERTISEMENT

హైదరాబద్ కి వెళ్ళిపోతున్న అక్కినేని ఇల్లు, కొనే క్రమంలో సావిత్రి ఇచ్చే బ్లాంక్ చెక్ పై అక్కినేని మాట్లాడే మాటలు, ఆ తర్వాత సీన్ లో అన్నగారు డబ్బు వెలువ తెలిపే సీన్ చూస్తే…నిజంగా అబ్బా…ఏం చెప్పారు రా రెండు ముక్కల్లో అనిపిస్తుంది. అయితే సావిత్రి ఆర్ధికంగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో, లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడిందో అంతా మనం మహానటి సినిమా మొత్తంగా చూసాం…

కానీ డబ్బు విషయంలో సావిత్రి మనస్తత్వాన్ని మాత్రం కళ్ళకు కట్టినట్లుగా చాల సున్నితమైన డైలాగ్స్ తో చూపించాడు క్రిష్. అంతేనా..ఎప్పుడూ వేరే టేక్ చేద్దాం అనని సావిత్రి ఆ సీన్ లో మరో టేక్ చేద్దాం అని అనగానే దర్శకుడు వచ్చి సావిత్రి మరో టేక్ అడగడమా అంటూ ఆశ్చర్య పోతాడు. అలా ఆ మహానటి గురించి ఒక్క రెండు సీన్స్ లో చూపించేసాడు క్రిష్.

ADVERTISEMENT
Latest Stories