వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరినట్టుంది!

nene Raju Nene Mantri Kajal Ranaఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హిట్ అంటే ఏంటో మరిచిపోయిన తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన రావడంతో పాటు ట్రేడ్ వర్గాలలోనూ పాజిటివ్ బజ్ ను సొంతం చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కధ రాజకీయ నేపధ్యంలో సాగనుంది.

పొలిటికల్ డైలాగ్ లు ప్రేక్షకులకు ఎంత కిక్ ఇస్తాయో అన్న విషయం పరుచూరి గోపాలకృష్ణ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టం చేయగా, అదే స్థాయిలో రానా – కాజల్ ల మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందనే టాక్ ను తాజాగా రిలీజ్ అవుతోన్న పోస్టర్లు చెప్పకనే చెప్తున్నాయి. అందుకు నిదర్శనంగానే రానా – కాజల్ ల ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రాధ పాత్రే చాలా కీలకం అని ఇప్పటికే స్పష్టమైన అంశం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories