అన్నీ ఉన్నా… కావాల్సిన ఆ సక్సెస్ ఒక్కటి మాత్రం యువ హీరో రామ్ దరిచేరడం లేదు. ఎనర్జిటిక్ యాక్షన్, అదరగొట్టే డ్యాన్స్ లు, చక్కని రూపం ఒకటేమిటి… ఒక నటుడికి కావాల్సినవన్నీ ఉన్నా, ఎంచుకోవాల్సిన కధలలో తప్పటడుగులు వేస్తున్నాడు. అయితే సక్సెస్ కోసం ఇప్పటివరకు ‘కందిరీగ’ మాదిరి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఎంచుకున్న రామ్, ఆ కధల నుండి బయటకు వచ్చి ‘నేను… శైలజ…’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫ్రెష్ లుక్ తో కనపడుతున్న రామ్ తనకు సూటైన సబ్జెక్టును ఎంచుకున్నట్లుగా కనపడుతోంది. హీరోయిన్ కీర్తి క్యూట్ లుక్స్, డైలాగ్స్, దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం అన్ని కధలో అంతర్లీనంగా ఉన్నాయన్న ఫీలింగ్ తేవడంలో టీజర్ సక్సెస్ అయ్యింది. దీంతో ‘నేను… శైలజ…’తో రామ్ హిట్ బాట పడతాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. జనవరిలో వెండితెరను పలకరించబోతున్న “నేను… శైలజ…” టీజర్…





