మెగాస్టార్ ‘అల్లుడు’ విషయంలో కొత్త ‘ట్విస్ట్’

new twist in chiranjeevi son in law kalyan srijaమెగాస్టార్ తనయురాలు శ్రీజ చేసుకోబోయే కనుగంటి కళ్యాణ్ ఫోటోలు ప్రస్తుతం వెబ్ మీడియాలో సందడి చేస్తున్నాయి. శ్రీజతో కళ్యాణ్ ఉన్న ఫోటోలను మెగా అభిమానులు షేర్ చేసుకుంటుండగా, కళ్యాణ్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నటువంటి కళ్యాణ్ ఎన్నారై అన్న విషయం వాస్తవం కాదని, కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారని, కేవలం విద్య నిమిత్తం దుబాయ్, యుఎస్ లకు వెళ్ళారని తెలుస్తోంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… శ్రీజ క్లాస్ మేట్ గా చెప్పబడుతున్న విషయం కూడా వాస్తవం కాదని, కళ్యాణ్ వాళ్ళ అమ్మ శ్రీజ వాళ్ళ అమ్మ స్నేహితులు కావడంతో ఈ వివాహం సెట్ అయ్యిందని కొత్త విషయాలు వెలుగు చూసాయి.

ADVERTISEMENT

అయితే ఇందులో ఎంత వాస్తవముందో గానీ, శ్రీజ వివాహాన్ని హైదరాబాద్ లో కాకుండా చెన్నైలో మార్చి 28వ తేదీన ప్లాన్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధం కాని పరిస్థితి. ఇద్దరూ హైదరాబాద్ కు చెందిన వారైతే చెన్నైలో ప్లాన్ చేయడమేంటి? అన్న ప్రశ్నలు నెటిజన్ల నుండి వ్యక్తమవుతున్నాయి. బహుశా వీటన్నింటిని నివృత్తి చేయాలంటే మెగా వర్గం ఒక్కసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే సరిపోతుందేమో..!

ADVERTISEMENT
Latest Stories