‘ఆహా’లో న్యూ ఇయర్ మజా!

'ఆహా'లో న్యూ ఇయర్ మజా!ప్రతి వారం సరికొత్త వినోదాన్ని అందిస్తోన్న తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఈ వారం కూడా రెడీ అయిపోయింది. 2022 కొత్త సంవత్సరం కూడా రావడంతో, ప్రేక్షకులను నైట్ అవుట్ చేయించేందుకు “సేనాపతి” రూపంలో ఓ వెబ్ సిరీస్ ను మరియు బాలయ్య ‘అన్ స్టాపబుల్’తో మాస్ మహారాజా రవితేజతో పండించే ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వనుంది.

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో “సేనాపతి” క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, ‘సేనాపతి’గా రాజేంద్రుడు చేయబోయే విన్యాసాలను ‘ఆహా’ ప్రసారం చేయబోతోంది. వెబ్ సిరీస్ రూపం కావడంతో, మరుసటి రోజు వేకువజాము వరకు ప్రేక్షకుల వినోదానికి డోఖా ఉండదు.

ADVERTISEMENT

అలాగే ‘అన్ స్టాపబుల్’లో బాలకృష్ణ సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత ‘ఆహా’కే సొంతమైంది. అంతకుముందు వరకు బాలయ్య మీద ప్రేక్షకులకున్న అభిప్రాయాలను పటాపంచలు చేసే విధంగా ‘అన్ స్టాపబుల్’ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వారం మాస్ మహారాజా రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనిలతో కలిసి సందడి చేయబోతున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన పలు ప్రోమోస్ ను ‘ఆహా’ విడుదల చేసి ప్రేక్షకుల ఆసక్తిని రాబట్టింది. ముఖ్యంగా బాలయ్యకు – రవితేజకు గొడవ జరిగిందని గతంలో పుకార్లు షికారు చేసిన నేపథ్యంలో… దీనినే మొదటి ప్రశ్నగా రవితేజను బాలయ్య ఈ షోను ప్రారంభిస్తున్నారు. మరి దీనికి రవితేజ చెప్పిన సమాధానం ప్రోమోలో రిలీజ్ చేసినప్పటికి పూర్తి స్థాయిలో వివరణ కావాలంటే ఈ వారం ‘ఆహా’ మజాను ఆస్వాదించాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories