పవన్ హీరోయిన్ ఆరోపించిన ఆ తెలుగు హీరో ఎవరు?

Nikesha Patel1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన బాహుబలి డైరెక్టర్ ఎవరు? అంటూ ఓ తెలుగు నటుడు తనను అడిగాడని పవన్ కల్యాణ్ సరసన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా నటించిన నికిషా పటేల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ లు పెట్టింది.

ఇటీవల ఓ తెలుగు హీరోను ‘బాహుబ‌లి-2: ద కన్ క్లూజన్’ సినిమా చూశావా’ అని అడిగాను. దానికి ఆ నటుడు తిరిగి నికీషా ప‌టేల్ ను ‘ఆ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు?’ అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడని తెలిపింది. దానికి తాను చాలా ‘ఆశ్చర్యపోయానని, అతనిని చూస్తుంటే అసహ్యమేసిందని, దీనికి సిగ్గుపడాలని’ తెలిపింది.

ADVERTISEMENT

ఆ నటుడు పేరును ఉచ్ఛరించాలంటే కూడా చిరాగ్గా ఉందని నికీషా పటేల్ తెలిపింది. కాగా, ఇప్పటికే రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలంతా అభినందించడంతో నికీషా పటేల్ తో ఇలా ఎవరు వ్యాఖ్యానించి ఉంటారు? అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories