“నిన్ను కోరి” షాక్ ఇచ్చినట్లే!

ninnu kori movie weekend boxoffice collections“బాహుబలి 2” తర్వాత ప్రేక్షకుల ఆమోదంతో హిట్ అయిన సినిమాగా “నిన్ను కోరి” నిలిచింది. ‘యూనివర్సల్ హిట్’ అన్న టాక్ ను సొంతం చేసుకున్న నాని “నిన్ను కోరి” సినిమా ఒక విధంగా ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. వరుసగా ఏడవ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ‘నాచురల్ స్టార్’ నాని, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాడు. బహుశా ఈ స్థాయి కలెక్షన్స్ వస్తాయని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లతో సహా నాని కూడా ఊహించి ఉండకపోవచ్చు.

ADVERTISEMENT

తొలి మూడు రోజుల్లో ఏకంగా 25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు టాప్ హీరోలకు మాత్రమే సాధ్యమైన కలెక్షన్స్ ను ఇపుడు నాని అందుకోవడం అనేది, కెరీర్ ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పవచ్చు. నాని గత చిత్రం “నేను లోకల్” కమర్షియల్ గా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇపుడు “నిన్ను కోరి” సినిమా దానిని అవలీలగా అధిగమించనుందని స్పష్టమవుతోంది. ఏపీ, తెలంగాణాలలోనే కాదు, యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా నాని విజయపు జెండా ఎగురవేశాడు.

యుఎస్ లో 1 మిలియన్ ను చేరుకోవడానికి మరో 3 లక్షల డాలర్స్ మాత్రమే కావాల్సి ఉండగా, వచ్చే వీకెండ్ నాటికి ఈ ఫిగర్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన భారీ చిత్రం అల్లు అర్జున్ ‘డీజే’కు కూడా యుఎస్ లో ఈ రేంజ్ వసూళ్లు లేకపోవడం విశేషం. ఎంతో కష్టంగా 1 మిలియన్ అందుకుంది గానీ, భారీ నష్టాలనే ‘డీజే’ మిగల్చగా, నాని “నిన్ను కోరి” ఇప్పటికే లాభాల బాట పట్టడంతో సినిమాను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories