పెళ్లి వాయిదా వేసుకున్న యువ హీరో

Nithiin Wedding Postponed due to Coronavirus effectకరోనావైరస్ లాక్డౌన్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచిపోయింది. కరోనాతో పోరాడటానికి రెండు తెలుగు ప్రభుత్వాలకు ముందుకు వచ్చి విరాళం ఇచ్చిన తెలుగు హీరోలలో యంగ్ హీరో నితిన్ మొదటివాడు. మరొక వైపు, అతను తన అభిమానులకు పలు జాగ్రత్తలు చెబుతూ ఒక లేఖను విడుదల చేశాడు.

తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నటుడు తన అభిమానులను కోరారు. రేపు నితిన్ తన 37వ పడిలోకి అడుగుపెడతాడు. అలాగే ఏప్రిల్ 16 న జరగాల్సిన తన వివాహం కూడా వాయిదా వేసుకుంటున్నట్టు నితిన్ తన అభిమానులకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ కీలకమైన సమయంలో ఇంట్లోనే ఉండి సామాజిక దూరం కొనసాగించాలని ఆయన అభిమానులను కోరారు.

ADVERTISEMENT

మరో వైపు నితిన్ తన రీసెంట్ సినిమా, భీష్మ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నితిన్ కు విజయం వచ్చింది. అతను దానిని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఆయన రాబోయే చిత్రం ‘రంగ్ దే’ రేపు (మార్చి 29, 2020) ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుంది. ఈ మూవీ జూలై 30 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు

ఈ సినిమా గాక నితిన్ అంధాధూన్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు, వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. దీనితో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా కూడా నితిన్ సైన్ చేశాడు.

ADVERTISEMENT
Latest Stories