ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు.. అమ్మడికి పని అవుతుందా?

nivetha-movies-vakeel-saab-sarkar-vaari-paataనివేతా థామస్ ట్యాలెంట్, అందం కలగలసిన అమ్మాయి. అయితే ఇప్పటికీ సరైన బ్రేక్ రాక ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఉన్నఫలంగా రెండు పెద్ద సినిమాలలో అవకాశం పొందింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో ఆమె ఒక రోల్ పోషిస్తుంది.

అలాగే మహేష్ బాబు తదుపరి చిత్రం… సర్కారు వారి పాటలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తుందని సమాచారం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల సినిమాలలో అవకాశం రావడం అంటే మాములు విషయం కాదు. అయితే ఈ రెండు సినిమాలు ఈ అమ్మడికి ఎంతమేరకు ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.

ADVERTISEMENT

వకీల్ సాబ్ ఒరిజినల్ పింక్ ని బట్టి ఆ సినిమాలోని పాత్ర వల్ల ఆమె కేరీర్ కు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని అర్ధం అవుతుంది. మహేష్ బాబు వంటి స్టార్ చేస్తున్న కమర్షియల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అంటే కూడా పెద్దగా స్కోప్ ఉండకపోవచ్చు. దీనితో ఈ అమ్మడికి ఏం రాసిపెట్టి ఉందొ చూడాలి.

వకీల్ సాబ్ లో ఆమె పోర్షన్ లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యిందని సమాచారం. వకీల్ సాబ్ సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు సర్కారు వారి పాట చిత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని అంటున్నారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకూ షూటింగ్ మొదలుపెట్టానని మహేష్ నిర్మాతలకు చెప్పాడట.

ADVERTISEMENT
Latest Stories