నిజమే… పవన్ సినిమాకు ‘నో’ చెప్పింది..!

Nivetha Thomas - Pawan Kalyan - Trivikram Srinivasపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కనీసం ఒక్క సీన్ లో నటించే అవకాశం దక్కినా చాలు… ఆ గుర్తింపే వేరని సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి అవకాశమే “నిన్ను కోరి” హీరోయిన్ నివేదా థామస్ దరి చేరితే, ఏకంగా ‘నో’ చెప్పింది. ఏంటి… నమ్మలేకున్నారా..! కానీ అది నిజమే… స్వయంగా ఈ విషయాన్ని నివేదానే స్పష్టం చేసింది.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో తనకు చెల్లెలి పాత్ర ఆఫర్ వచ్చిందని, అయితే కధానాయికగా స్థిరపడుతున్న తరుణంలో, అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేక సున్నితంగా ఆ సినిమాను తిరస్కరించినట్లుగా స్పష్టం చేసింది నివేదా. అయితే అలా చెప్పాల్సి వచ్చినందుకు, పవన్ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని తెలిపింది.

ADVERTISEMENT

భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తుందనే నమ్మకం బలంగా ఉందని, ఆ రోజు కోసం ఎదురు చూస్తానని స్పష్టం చేసింది. ఒక రకంగా కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని నివేదా తీసుకున్న నిర్ణయం సమంజసమేనని “నిన్ను కోరి” సినిమా చూసిన తర్వాత ఎవరైనా అంగీకరించేదే. ఏది ఏమైనా పవన్ వంటి క్రేజీ హీరో సినిమాను సైతం పక్కన పెట్టడం అనేది, ఒక రకంగా సాహోసోపేతమైన నిర్ణయమే.

ADVERTISEMENT
Latest Stories