ys-jagan-11-mlas-ysrcp

ఒక్కోసారి ఎవరైనా తప్పు చేయొచ్చు. కానీ అది గుర్తించి సరిదిద్దుకుని ముందుకు సాగుతుండాలి. కానీ అది తప్పు అని తెలిసి కూడా చేయడం, తప్పుని గట్టిగా సమర్ధించుకోవడం, ఆ తప్పు వలన నష్టపోయినా అంగీకరించలేక అందుకు ఇతరులను నిందిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం కేవలం జగన్‌ మాత్రమే చేయగలరనిపిస్తుంది.

Also Read – బెంగుళూరు ప్యాలస్‌లో అపరిచితుడు

సంక్షేమ పధకాలతో ఓటు బ్యాంక్ నిర్మించుకోవాలనుకోవడం ఓ దురాశ. దాని కోసం అప్పులు చేయడం అవివేకం. సంక్షేమ పధకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతాయనుకోవడం అజ్ఞానం. వాటితో మేలు కలిగితేనే ఓట్లు వేయండి లేకపోతే మీ ఓట్లు నాకు అక్కర్లేదని చెప్పడం దురహంకారం.

ఒక ఆలోచన, దాని అమలులోనే ఇన్ని లోపాలు స్పష్టంగా కన్పిస్తున్నప్పుడు వాటిని చూడలేకపోవడం మూర్ఖత్వం. ఓడిపోయినా ఆ మూర్ఖత్వాన్ని సమర్ధించుకొంటూ, టిడిపి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తుండటం రాజకీయ మూర్ఖత్వమే.

Also Read – పాపం శ్యామల… ఎలా నెగ్గుకొస్తారో?

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారంటే అర్దంచేసుకోవచ్చు. కానీ తన ధోరణి వలననే ఓడిపోయామని తెలిసి ఉన్నా ఇంకా అహంభావంతో వ్యవహరిస్తూ చేజేతులా సమస్యలను దగ్గరకు జరుపుకుంటున్నారు లేదా వాటిలోకి ప్రవేశించడానికి ఉవ్విళ్ళూరుతున్నారని చెప్పక తప్పదు.

ఇవి సరిపోన్నట్లు ప్రతిపక్ష నేత హోదా, భద్రత కావాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. జగన్‌ ఈవిదంగా రాజకీయాలు చేస్తూ ఏం సాధించాలని అనుకుంటున్నారు? అసలు ఇలాంటి కాలక్షేప రాజకీయాలతో ఏదైనా సాధ్యపడుతుందా?అని ఒక్కసారి కూడా జగన్‌ ఆలోచించిన్నట్లు లేదు. కనీసం ఆ పార్టీ నేతలు, శ్రేయోభిలాషులు కూడా ఆయనకు చెప్పిన్నట్లు లేదు.

Also Read – కేజ్రీవాల్‌ కాదు… క్రేజీవాల్… 48 గంటల్లో రాజీనామా!

అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కొట్టుకుపోతాయి. కానీ విపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు సరైన దిశలో పయనించలేకపోతే ఆయనతో పాటు నమ్ముకున్నవారు కూడా మునిగిపోతారు టైటానిక్ షిప్పు మాదిరిగా!




ఇప్పటికే వైసీపి దాదాపు మునిగిపోయింది. వారు కనుక నిండా మునిగినవాడికి చలి ఏమిటి? అనుకుంటున్నారో ఏమో తెలీదు కానీ వైసీపి అధినేత జగన్‌ తీరు మారలేదు. ఆయనను నమ్ముకున్నవారికి అదే శాపంగా మారింది. ఆ శాపవిముక్తికి ఒకటే పరిష్కారం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చురుకుగా వ్యవహరిస్తే చాలు వైసీపిలో ఒక్క జగన్‌కు తప్ప మిగిలిన అందరికీ శాపవిముక్తి లభిస్తుంది.