Pinnelli Ramakrishna Reddy

పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో దాగుడు మూతలు ఆడుతున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన విష్యం తెలిసిందే. అందుకు తగ్గట్టే న్యాయస్థానం కూడా ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

అయితే పోలింగ్ రోజే వైసీపీ అభ్యర్థి ఈ విధంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను ధ్వంసం చేసి మాచర్ల నియోజకవర్గంలో దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టించిన పిన్నెల్లి ని కౌంటింగ్ రోజు మాచర్లలోకి అడుగు పెట్టవద్దని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి కౌంటింగ్ రోజు కూడా మాచర్లలో ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం కష్టమనేది అధికారుల వాదన.

Also Read – ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు… మమ్మల్ని కాపాడవా… ప్లీజ్!

ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కౌంటింగ్ రోజు కేంద్ర బలగాలతో అదనపు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూటమి నేతలు అధికారులను హెచ్చరిస్తున్నారు. ఈవీఎం లను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ని అరెస్టు చేయాలనీ ఈసీ ఆదేశించినప్పటికీ ఆయనకు హై కోర్ట్ ముందస్తు బెయిలు ఇషూ చేసింది. అయితే మాచర్లకు అనుమతి ఇవ్వని కోర్ట్ నర్సరావుపేట కౌంటింగ్ సెంట్రల్ కు వెళ్లేందుకు మాత్రం పిన్నేల్లికి అనుమతినిచ్చింది. జూన్ 4 కౌంటింగ్ రోజు కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీల తరుపున పోటీ చేసిన నాయకులు ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇదిలా ఉంటే., ధ్వంసం చేసిన ఈవీఎం లో వివిప్యాట్ల ఆధారంగా టీడీపీ సైకిల్ గుర్తుకు 22 ఓట్లు, వైసీపీ ఫ్యాన్ కి 6 ఓట్లు మాత్రమే పడ్డాయని, ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నిశ్శబ్ద యుద్ధం రూపంలో చూపించారని జూన్ 4 తరువాత రాష్ట్రంలో ఇటువంటి రౌడీ పాలన అంతమొందుతుందని కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందనే ధీమాగా ఉన్నారు టీడీపీ నేతలు.

Also Read – ఋషికొండ ప్యాలస్‌కి అమరావతి భవనాలకు పోలికా?

మాచర్లలో మార్పు మొదలయ్యింది…ఇప్పుడు కోర్ట్ ఆదేశాలతో మాచర్లలోకి అడుగుపెట్టలేని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జూన్ 4 తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాచర్లలో అడుగు పెట్టలేని పరిస్థితికి రాబోతున్నారు అంటూ గెలుపు పై గట్టి నమ్మకంగా ఉన్నారు మాచర్ల టీడీపీ నేతలు.

Also Read – పాలన చేసారా.? లూటీ చేసారా.?