కమర్షియల్ సినిమాలన్నీ క్లాసిక్ హిట్లు అనిపించుకోవు

Vijay Vaarasuduచిన్నా పెద్ద హీరో ఎవరైనా సరే ఒక సినిమా విజయాన్ని నిర్ణయించడానికి కేవలం బాక్సాఫీస్ లెక్కలనే ప్రతిసారి కొలమానంగా తీసుకోలేం. నిజమైన బ్లాక్ బస్టర్ కి కాలదోషం ఉండదు. దశాబ్దాల తర్వాత చూసినా జెనరేషన్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉండాలి. మొన్న పోకిరి జల్సా రీ రిలీజ్ చేసినప్పుడు అత్యధిక శాతం థియేటర్లకు వచ్చింది పాతికేళ్ల లోపు బ్యాచే. అంటే అవి విడుదలైన అసలైన తేదీలకు వీళ్ళు స్కూళ్లకు కూడా వెళ్లి ఉండరు. కానీ వయసొచ్చాక టీవీలోనో ఆన్ లైన్ లోనో చూసి నచ్చాక వీటిని బిగ్ స్క్రీన్ మీద అనుభూతి చెందాలని ఉవ్విళూరి టికెట్లు కొని హౌస్ ఫుల్ చేశారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ పేరుతో బ్లాక్ బస్టర్లకు క్లాసిక్ లకు కొత్త అర్థాలు తీస్తున్నారు. ఫలానా సినిమాకు థియేటర్ వసూళ్లలో ఓ మూడు వందల కోట్లు వచ్చాయి. తీరా అదే మూవీ ఓటిటిలో వచ్చాక నెటిజెన్లు ఇదేం కళాఖండం బాబోయ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. వారసుడుకి ఇది అనుభవమవుతోంది. కొన్నింటికి టైం కలిసి వస్తుంది. అసలు పోటీ లేకపోవడం లేదా సంక్రాంతి లాంటి గోల్డెన్ సీజన్ కలిసి రావడం లాంటి కారణాలు భారీ కలెక్షన్లకు దోహదం చేస్తాయి. ఇస్మార్ట్ శంకర్, ధమాకా లాంటివి మొదటి రోజు యునానిమస్ టాక్ రివ్యూలు తెచ్చుకున్నవి కాదు.

ADVERTISEMENT

అలా అని వీటికి విపరీతమైన రిపీట్ వేల్యూ ఉందా అంటే అదీ లేదు. వరిసుకి మూడు వందల కోట్లు వచ్చాయి కాబట్టి ఇది ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనేది ఫ్యాన్స్ వాదన. నిజానిజాలు దేవుడికెరుక కానీ నిజంగా అంత గొప్ప చిత్రమే అయితే ఇప్పుడు డిజిటల్ లో వచ్చాక అంతే స్థాయిలో ప్రశంసలు కురవాలిగా. ఏదీ ఎక్కడ జరుగుతోంది. దీన్ని బట్టే సీజనల్ అడ్వాంటేజ్ (అనుకూల పరిస్థితులు కలిసిరావడం) ని వాడుకుని స్టార్ హీరోలు ఎంత క్రింజ్ కామెడీ చేసినా ఎంత రొట్ట కంటెంట్ తో వచ్చిన రికార్డులు నమోదవుతాయని అర్థం చేసుకోవచ్చు. పాతిక రోజులు దాటగానే చప్పున చల్లారిపోవడం ఎదురుగా కనిపిస్తోంది.

అంతే తప్ప ఫిగర్లను బట్టి దాని రేంజ్ కి డిసైడ్ చేయడం వల్ల భవిష్యత్తు తరాలను బాగున్న బాగాలేని సినిమాకు వ్యత్యాసం గుర్తించలేని స్థితికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పుడేదో టైం కలిసొచ్చి రొటీన్ కంటెంట్ తో పాసైపోయిన సీనియర్ హీరోలు సైతం జనాలు తమ నుంచి అదే కోరుకుంటున్నారని భ్రమపడి నిర్మాణంలో ఉన్నవాటిని ఆపి మరీ రొటీన్ ఫార్ములాతో రిపేర్లు చేయించడం అసలు కామెడీకి పరాకాష్ట. గత కొన్నేళ్లుగా ఈ ధోరణి పెరిగిపోతోంది. డిజాస్టర్లకు టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్న నిర్మాతలు మనచుట్టే బోలెడున్నారు. వాటిలో ప్రేక్షకులను పారిపోయేలా చేసినవి ఉన్నాయి. అలా అయితే వాటికి సక్సెస్ ఫుల్ మూవీ అని ట్యాగ్ వేస్తే అంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది.

ADVERTISEMENT
Latest Stories