పవన్ కళ్యాణ్ ను గుర్తు చేసిన విజయ్ దేవరకొండ!

NOTA-Press-Meetగాంధీ భావాలే తన భావాలు… ఆయన నడవడికే తనకు మార్గం… అంటూ ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే పవన్ కళ్యాణ్… “ఓటును మాత్రం అమ్ముకోండి” అంటూ గతంలో ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి… కానీ ఓటు మాత్రం జనసేనకే గుద్దండి’ అంటూ జనసేన నాలుగవ వార్షికోత్సవంలో ఈ ఆదర్శ భావాలున్న పవన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

[m9ad]

ADVERTISEMENT

కట్ చేసి… సోమవారం నాడు జరిగిన ‘నోటా’ పబ్లిక్ మీటింగ్ కు వస్తే… ‘తన సినిమాపై కేసు వేసినందుకు గానూ, అలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఏమీ లేవని చెప్తూ’ ఓ బహిరంగ ప్రమాణ స్వీకారం చేసారు, అభిమానుల చేత చేయించారు కూడా! ఇందులో భాగంగా ‘రెండు వేలకు, మూడు వేలకు కక్క్రుర్తి పడబోమని’ ప్రేక్షకుల చేత ఓటు వేయించి, ఆదర్శ భావం ఎలా ఉండాలో పరోక్షంగా రాజకీయ నేతలకు చెప్పకనే చెప్పాడు.

ఒక సినిమా కోసమే విజయ్ దేవరకొండ అంత ఆదర్శప్రాయమైన అభిప్రాయం వ్యక్తపరిస్తే, ప్రజా జీవితంలోకి వచ్చిన జనసేన అధినేత ఇంకెంత ఆదర్శంగా ఉండాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘నోటా’ పబ్లిక్ మీటింగ్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ జ్ఞప్తికి రావడం సహజమే.

ADVERTISEMENT
Latest Stories