“నోటా” ఫస్ట్ డే టార్గెట్ “గీత గోవిందం”

petitions-against-nota-in-hyderabad-high-court“గీత గోవిందం” సినిమాతో అనూహ్యంగా 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన విజయ్ దేవరకొండ, ఆ సినిమా 50 రోజులు ముగియగానే, “నోటా” అనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. రిలీజ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందన్న అంశం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

[m9ad]

ADVERTISEMENT

‘గీత గోవిందం’ సినిమాతో సెకండ్ లీగ్ లో ఉన్న లెక్కలన్నీ మార్చేసిన విజయ్ దేవరకొండ, ఇపుడు తన రికార్డులను తానే బద్దలు కొట్టి, తాను ‘వన్ మూవీ వండర్’ కాదని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే అంత బజ్ “నోటా”పై ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం చిత్ర దర్శకుడు ఆనంద్ తమిళియన్ కావడం.

అలాగే ‘గీత గోవిందం’కు దక్కినంత పబ్లిసిటీ ‘నోటా’కు దక్కలేదు. అంతేకాకుండా ‘నోటా’ సబ్జెక్ట్ ఒకటి, రెండు వర్గాలకే పరిమితం అయ్యేది కాగా, “గీత గోవిందం” అన్ని వర్గాలను అలరించే అంశం. మరీ ముఖ్యంగా “నోటా” చిత్ర ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకులలో ‘వావ్’ ఫీలింగ్ ను కలిగించలేక, జస్ట్ పాస్ మార్కులను మాత్రమే వేయించుకుంది.

ADVERTISEMENT
Latest Stories