రష్మి… ఇలాంటి సినిమాలు అవసరమా..?

nthaku-minchi-telugu-trailer-rashmi-gautam‘గుంటూరు టాకీస్’ చిత్రంతో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ‘జబర్దస్త్’ యాంకర్ రష్మి, ఆ తర్వాత ‘అంతం, చారుశీల, తను వచ్చేనంట, నెక్స్ట్ నువ్వే’ వంటి హర్రర్ సినిమాలలో నటించింది. అయితే ఒక్క సినిమా కూడా రష్మి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇలా హార్రర్ సినిమాల బ్యూటీగా పేరుగాంచిన రష్మి మళ్ళీ అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకోవడం కొసమెరుపు.

రష్మి ప్రధాన పాత్రలో నటించిన “అంతకు మించి” అనే హర్రర్ మూవీకి సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆ సినిమా ట్రైలర్ గురించి గానీ, అందులో రష్మి ప్రదర్శించిన అందచందాల గురించి గానీ ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ‘ఇలాంటి సినిమాలనే రష్మి ఎందుకు చేస్తోంది?’ అన్న ప్రశ్న తలెత్తకమానదు. అందచందాలతో పాటు సిల్వర్ స్క్రీన్ ప్రజెన్స్ కలిగిన రష్మి మున్ముందు అయినా ఇలాంటి సినిమాలపై పునరాలోచన చేసుకోవడం మంచిది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories