ఎన్టీఆర్ బయో పిక్ పై అంచనాలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఒక పక్క ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో మరో పక్క ఈ సినిమా లెంత్ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
[m9ad]
ఎన్టీఆర్ జీవితాన్ని ఒక భాగంగా చూపించే అవకాశం లేక అటు సినిమా జీవితాన్ని, ఇటు రాజకీయ ప్రభంజనాన్ని రెండు భాగాలుగా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి భాగంలోనే ఎన్టీఆర్ తీసిన కళాఖండాలు అన్నింటినీ కవర్ చేసి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా కవర్ చెయ్యడం అంటే సినిమా మూడు గంటల వ్యవధి దాటిపోతుందట. అయితే ఆ క్రమంలో స్క్రిప్ట్ ని ఆధారంగా చేసుకుని ఏ సీన్లు ఉంచాలి, ఏ సీన్లకు కట్ చెప్పాలి అన్న మ్యాటర్ లో క్రిష్ అడుగులు కాస్త తడబడుతున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత బయోపిక్ అయినా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది…అందుకే ఈరోజు నుంచి బాలయ్య ప్రచారం అనంతరం తిరిగి రానుండడంతో సీన్స్ పై బాలయ్య డిసిషన్ ఫైనల్ అని చెప్తున్నారు. ఎందుకంటే బాలయ్య ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడాను.
మొత్తంగా చూసుకుంటే అన్నగారి చరిత్రను ప్రేక్షకులకు నచ్చే విధంగా ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఆవిష్కరించే పనిలో క్రిష్ మరియు బాలయ్య సర్వ శక్తులే ఒడ్డుతున్నారు అని చెప్పవచ్చు. మరి ఈ బయోపిక్ ఎంతటి ఘన విజయం సాధిస్తుందో తెలియాలి అంటే మాత్రం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.



