మహేష్ – రాజమౌళి సినిమాపై ఎన్టీఆర్ కామెడీ!

మహేష్ - రాజమౌళి సినిమాపై ఎన్టీఆర్ కామెడీ!“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జక్కన్న తదుపరి సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందించిన రాజమౌళి, ‘ఇంతకుముందే నేను, మహేష్ ప్రకటించి ఉన్నాం, నాన్న గారు ఏవో నాలుగైదు లైన్స్ అనుకున్నారట, కాకపోతే ప్రస్తుతం దాని మీద దృష్టి పెట్టే సమయం తనకు లేదంటూ’ చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ కోసం తామిద్దరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పిన జక్కన్న, ఈ సందర్భంగా మరోసారి మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత సంక్రాంతి సినిమాలలో మొదటగా వాయిదా వేసింది మహేష్ యేనని రాజమౌళి చెప్పగా, తదుపరి లైన్స్ ను జూనియర్ ఎన్టీఆర్ అందుకున్నారు.

ADVERTISEMENT

ఆ సినిమా విడుదల ఖచ్చితంగా 2026లో ఉంటుందని చెప్పి, అక్కడున్న వాతావరణం మొత్తాన్ని ‘కామెడీ’ చేసేసారు. అయితే తారక్ రిలీజ్ డేట్ పై రాజమౌళి ‘నో’ అంటూ బదులిచ్చారు. బహుశా కరోనా వంటి ఏ ఇబ్బందులు లేకపోతే 2025 కల్లా వచ్చేయొచ్చులే, అప్పుడు మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు, ఈ స్థానంలో మహేష్ ఉంటారంటూ తారక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మహేష్ పాల్గొన్న సమయంలో కూడా రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ హాస్యాన్ని పండించిన విషయం తెలిసిందే. రాజమౌళితో జత కడుతున్నావుగా, ఒక్క క్రికెట్ ఏమిటి? అన్ని ఆటలు ఆడిస్తాడులే, తొందరెందుకు? అంటూ మహేష్ ను కాస్త ఉడికించే ప్రయత్నం చేసాడు.

ADVERTISEMENT
Latest Stories