సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “నాన్నకు ప్రేమతో” సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అధికారికంగా చిత్ర యూనిట్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.., ముందుగా చెప్పిన జనవరి 8వ తేదీకి ఒక వారం లేటుగా విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల టాక్.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని స్టిల్స్, ఒక టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయినప్పటికీ సినిమాపై పెద్దగా ఎటువంటి అంచనాలు ఏర్పడలేదు. జూనియర్ ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతుండడం, సుకుమార్ గత చిత్రం ‘1 నేనొక్కడినే’ పరాజయం పాలు కావడం, సినిమాకు “నాన్నకు ప్రేమతో” వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడంతో.., ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడలేదు. అయితే, టీజర్ యూ ట్యూబ్ లో బాగానే సందడి చేసినప్పటికీ, అందులో ఎక్కువ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీంతో ఒకింత నిరాశలో ఉన్న ‘బుడ్డోడు’ అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఈ రోజు ఒక స్టిల్ ను విడుదల చేసింది.
జీబ్ పై కూర్చుని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ స్టిల్ తో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ ఫోటో డిజైనింగ్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. ఫోటోలోని బ్యాక్ గ్రౌండ్, బుడ్డోడు కూర్చున్న విధానం, స్టైలిష్ లుక్, జీబ్ … ఇలా అన్నీ ఫ్యాన్స్ ను పిచ్చేక్కిస్తున్నాయి. సుకుమార్ టేకింగ్, జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ సినిమా పై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఒక్క స్టిల్ ఎంతటి మార్పును తీసుకువస్తుందో “నాన్నకు ప్రేమతో” పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇక సందడి చేయడం ‘బుడ్డోడు’ అభిమానుల వంతు..! కాదంటారా..!!





