జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి తాజాగా ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం “నాన్నకు ప్రేమతో” సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న ‘బుడ్డోడు’కు ఓ బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. అయితే, మరో ఆలోచనకు తావు లేకుండా ‘నో’ చెప్పేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. అయితే ఇంతకీ వచ్చిన ఆఫర్ ఏంటి? జూనియర్ ఎందుకు వదులుకున్నాడు?
ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ ‘వేదాళం’ని తెలుగులో రీమేక్ చేస్తామని, ఇందుకు గానూ ఏకంగా 20 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ను ముట్ట చెప్తామని ఓ నిర్మాత ఆఫర్ చేసారట. అయితే ఆ సినిమాలో హీరో పాత్రతో పాటు ఇతర తారాగణం పాత్రల నిడివి కూడా ఎక్కువ ఉండడంతో వాటిని సున్నితంగా తిరస్కరించాడట.
గతంలో ‘ఊసరవెల్లి’ విషయంలో ఇలాగే ఆలోచించి తప్పు చేసానని గుర్తు చేసుకున్నారట. రాబోయే రెండేళ్ల వరకు తన వద్ద డేట్లు లేవన్న జవాబుతో “వేదాళం” రీమేక్ నుండి ‘బుడ్డోడు’ బయట పడ్డాడట. కొత్త ప్రాజెక్టుల విషయంలో జూనియర్ ఇపుడు మరింత శ్రద్ధను కనపరుస్తున్నారని ఫిల్మ్ నగర వర్గాలు చెప్పుకుంటున్నాయి.





