ఎన్టీఆర్ సెంటిమెంట్ మోక్షజ్ఞకు కూడా..!

ntr sentiment for mokshagnaనందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని టాక్. అభిమానుల్లో భారీ అంచనాలు ఉండడంతో బాలయ్య కాస్త వర్క్ వర్క్ చేస్తున్నారని సమాచారం. రచయితలతో కలిసి సిట్టింగ్స్‌లో కూర్చొంటున్న బాలయ్య, తన 100వ సినిమా ద్వారానే మోక్షజ్ఞని వెండితెరపై తీసుకు రావాలని స్కెచ్ వేశారట. దీంతో తండ్రి సినిమాలో కొడుకు రోల్ ఏంటి? ‘మనం’ మూవీలో అఖిల్ పాత్ర మాదిరిగానే కొన్ని సెకన్ల పాటు సందడి చేస్తాడా? లేక కొన్ని నిముషాల పాటు తెరపై సందడి చేస్తాడా? అనేది అభిమాన వర్గాల్లో చర్చకు దారితీసాయి.

ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు… దాదాపు 10 నిముషాల పాటు మోక్షజ్ఞ కనిపిస్తాడట. చిన్నప్పటి బాలకృష్ణ రోల్‌లో గణిత శాస్త్ర ప్రావీణ్యుడిగా కనిపిస్తాడనే వార్తలు కృష్ణనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు మరో సైంటిస్ట్‌కు టైమ్ ట్రావెలింగ్‌లో తన తెలివితేటలతో సహాయ పడతాడట.

ADVERTISEMENT

గతంలో బాలకృష్ణను వెండితెరకు పరిచయం చేసే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇదే తరహా వైఖరికి అనుసరించారని, అందుకే, ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అలానే వుండనుందని సమాచారం. మరి ఇదే నిజమైతే బాలయ్య మాదిరే నందమూరి అభిమానులకు మోక్షజ్ఞ ఆరాధ్యుడిగా వేలుగొండుతాడా?

ADVERTISEMENT
Latest Stories