టీజర్ టాక్ – ఈ హీరోకు అంత తోపుందా?

Nuvvu-Thopu-Raa-Official-Teaser‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా పరిచయమైన సుధాకర్ ప్రధాన పాత్రలో “నువ్వు తోపు రా” సినిమా తెరకెక్కింది. విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నాడని ప్రచారం జరగడంతో, సహజంగానే నెటిజన్ల కళ్ళు పడ్డాయి. కానీ టీజర్ లో అంత విషయం లేదని పెదవి విరవడం వీక్షకుల వంతవుతోంది.

ముఖ్యంగా సుధాకర్ ఈ క్యారెక్టర్ లో చూడడం కాస్త కష్టమైన విషయమే. అలాగే టీజర్ లో వినిపించిన డైలాగ్స్ ‘దురద, గిన్నె, మూతి’ వంటి పదాలు బి గ్రేడ్ గా అనిపిస్తాయి. టైటిల్ ముందుగా నిర్ణయించుకుని, అందుకు తగ్గట్లుగా హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేసారో ఏమో గానీ, హీరో మాత్రం నిజంగానే తోపులా నటించే ప్రయత్నం చేసారు. అయితే ఆ తోపు సుధాకర్ కావడమే అసలు పాయింట్.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories