ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో బ్రిటీష్ నటి ఒలివియా మొర్రీస్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. తాజాగా నేడు (శుక్రవారం) ఆమె బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర బృందం. `జెన్నీఫర్` పాత్రలో ఆమె నటిస్తున్నట్టు తెలిపింది.
పోస్టర్ లో ఒలివియా చాలా అందంగా ఉంది. అయితే అంతవరకూ ఒకే కానీ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఇంకా వెలితిగానే ఉంది. ఈ సినిమాలో మరో స్టార్ రామ్ చరణ్ కి బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. రామ్ చరణ్ కు బాలీవుడ్ నటి, ఎన్టీఆర్ కు ఊరుపేరు తెలియని నటి అని వారు పెదవి విరుస్తున్నారు.
అయితే కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఉండాలి. కావున తప్పలేదు. వీరితో పాటు శ్రియా, అజయ్ దేవగన్, సముద్రఖని, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ డేట్ పై మిశ్రమ స్పందన ఉన్న సంగతి తెలిసిందే.
అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం. మరోవైపు… ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బృందం రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు.





