పుష్ప… పార్టీ ముందే వచ్చిందేంటి..!

Oo Antava..Oo Oo Antava Pushpa Song Samantha Ruth Prabhu‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డైలాగ్స్ లో ‘పుష్ప… పార్టీ లేదా…?’ అన్నది ప్రధమ స్థానంలో నిలిచింది. పార్టీ లేదా అనగానే సమంత స్పెషల్ సాంగ్ విజువల్స్ చూపించిన చిత్ర యూనిట్, నేడు ఆ పాట లిరికల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ADVERTISEMENT

బహుశా ట్రైలర్ విషయంలో జరిగిన తప్పిదాన్ని సరిచేసుకోవాలని భావించారో ఏమో గానీ, ‘పుష్ప పార్టీని ఒక గంట ముందే తీసుకువచ్చారు. సాయంత్రం 7.02 నిముషాలకు రిలీజ్ కావాల్సిన సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 6.12 నిముషాలకే విడుదలై అభిమానులను ఊపేస్తోంది.

సుకుమార్ – దేవి కాంబోలో ‘స్పెషల్ సాంగ్’ అంటే ఓ క్రేజ్ ఉంటుంది. మరి ఆ క్రేజ్ ను ఈ సాంగ్ అందుకుందా? అంటే లిరిక్స్ పరంగా అయితే ‘ఖచ్చితంగా’ అనే చెప్పాలి. ‘మగ బుద్ధి’ని వర్ణిస్తూ చంద్రబోస్ అందించిన సాహిత్యం మాస్ వర్గాలను ఓ రేంజ్ లో ఉర్రూతలూగిస్తోంది.

ముఖ్యంగా ‘దీపాలన్నీ ఆర్పేసాక’ తర్వాత పలికిన ‘ఉ ఊ’లు రేపు ధియేటర్ లో మాస్ ప్రేక్షకులను సీట్లొల్లో కూర్చోబెట్టేలా లేదు. ఇక ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ లో కనిపిస్తోన్న సమంత, ఈ లిరిక్స్ తో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడం ఖాయంగా కనపడుతోంది.

చంద్రబోస్ లిరిక్స్ ఇచ్చిన కిక్ దేవిశ్రీ మ్యూజిక్ గానీ, ఈ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహన్ గానీ ఇవ్వలేకపోయాయి. బహుశా మరో మాస్ వాయిస్ ఉన్న గాయకురాలు పాడి ఉంటే ప్రేక్షకులకు ఇంకాస్తా కిక్ ఉండేదేమో! మొత్తానికి టైంకు దించి బన్నీ ఫ్యాన్స్ చేత ‘ఉ ఊ’లు పలికించడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories