యువ హీరో శర్వానంద్ నటిస్తున్న”పడి పడి లేచే మనసు” సినిమాకి బడ్జెట్ భారీగా పెరిగిపాయింది అని నిర్మాతలు కాస్త టెన్షన్ పడుతున్నట్లు గత కొంత కాలంగా మాటలు వింటూనే ఉన్నాం..
[m9ad]
అయితే యువ హీరోలకు 20 నుంచి 25 కోట్ల బడ్జెట్ సరిపోతుంది అని కానీ, శర్వానంద్ తాజా సినిమాకు ఏకంగా 40 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యింది అని…మరో పక్క ఈ సినిమా కథపై వస్తున్నా రకరకాల రూమర్స్ వల్ల ఈ సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాయి ట్రేడ్ వర్గాలు.
అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ…శర్వానంద్ కెరీర్ లోనే భారీగా బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటికే అన్నీ కలసి 22 . 80 కోట్లకు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది అని. అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 20 కోట్ల వసూళ్లుకు పైగా సాధిస్తే చాలు నిర్మాతలకు పండగే అని తెలుస్తుంది.
మరి ఆ మార్క్ ను ఈ సినిమా అందుకుంటుందో లేదో…చూడాలి అంటే ఈ 21 రిలీజ్ వరకూ ఆగాల్సిందే.



