హీరో మార్కెట్ ని బట్టి సినిమాను తెరకెక్కించాలి… ఆ మార్కెట్ రేంజ్ ని బట్టే సినిమా బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి..హీరో మార్కెట్ వేల్యూ ఎంత? ఎంత పెడితే మనం రికవర్ చేసుకోగలం అన్న విధానాన్ని ఆలోచించే సినిమాని తియ్యడానికి ఆలోచన చెయ్యాలి అలా కాకుండా తలకు మించి బడ్జెట్ పెడితే మునిగిపోక తప్పదు..
[m9a]
తాజాగా పడి పడి లేచే మనసు సినిమానే దానికి ఉదాహరణ. 19 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తాను అని చెప్పిన దర్శకుడు హను రాఘవపూడి..కట్ చేస్తే మరో 11 కోట్లు పెంచేసి 30 కోట్లు చేసాడు..ఇక ప్రమోషన్స్..అవి..ఇవీ కలసి మొత్తంగా 33 నుంచి 34 వరకూ అయ్యింది.
కట్ చేస్తే సినిమా భారీ డిజాస్టర్ కాగా…గ్యారంటీ హీరో అయిన శర్వానంద్ వల్ల నిర్మాత చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి..దాదాపుగా నిర్మాతలకు 20 కోట్ల నష్టం వచ్చింది అంటే ఆలోచించవచ్చు సినిమా రేంజ్ ఎలా ఉందో..20 కోట్ల వరకూ ఉన్న శర్వా మార్కెట్ ని దాటి మరీ ముప్పై పెట్టించి…చివరకు నష్టాలే మిగిల్చారు..
మరి ఇప్పటికైనా నిర్మాతలు అందరూ కాస్త అలోచించి..పెట్టుబడుల విషయంలో కాస్త ఆచి తూచి ముందుకు సాగితే..నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు..లేదంటే ఉన్నది అమ్ముకుని రోడ్డు మీదకు వచ్చెయ్యడమే.



