అక్కడ సంపాదించేది…ఇక్కడ తగలెయ్యడానికేనా!

padi padi leche manasu producer Sudhakar Cherukuriమరో ‘ఎన్నారై’ టీమ్ ఆశలు అడియాశలు అయ్యాయి..పాపం జీవిత కాలం కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా సినిమా పేరుతో తగలపెట్టుకుంటున్నారు ఎన్నారైలు…ఎందుకో తెలీదు..సినిమా పరిశ్రమ అంటే కోట్లు కుమ్మరించి చిల్లర వేడుకోవడం అని తెలిసి కూడా ఆ ఇండస్ట్రీలో భారీగా ఖర్చుపెట్టి..మరీ నష్టపోతున్నారు నిర్మాతలు.

[m9ad]

ADVERTISEMENT

అందులో ఇండస్ట్రీ ఎదిగే క్రమంలో ఎన్నారైలు నిర్మాతలుగా మారి కోట్లు కుమ్మరించి ఫ్లాప్స్ తీస్తూ వాళ్ళు ఆర్ధికంగా చితికిపోతున్నారు. మైత్రి మూవీస్…నిర్వానా సినిమాస్…ఎస్.ఆర్.టీ సినిమాస్ ఇలా వరుసగా ఎన్నారై సంస్థలు నిర్మాణంలోకి దిగిన తరుణంలో తాజాగా ఎస్.ఎల్.వీ సినిమాస్ కూడా ఆ కోవలోకి వచ్చి చేరింది..

శర్వానంద్ తో వాళ్ళు తెరకెక్కించిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా భారీగా దెబ్బ తీసింది…అయితే అనుకున్నదాని కన్నా భారీగా ఖర్చు పెట్టడం…దాదాపుగా మార్కెట్ ను మించి 40 కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు..ఇక సినిమా చాలా చోట్ల బయ్యర్స్ దొరకకపోవడంతో సొంతంగా రిలీజ్ కూడా చేశారు..కట్ చేస్తే సినిమా ప్లాప్ అయ్యి..నష్టాలే మిగిలించింది..

మరి ఈ అనుభవాలతో అయినా..మున్ముందు ఎన్నారైలు సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకటికి పడి సార్లు ఆలోచించుకుంటారేమో చూడాలి…

ADVERTISEMENT
Latest Stories