మహేష్ అంటే పిచ్చి అంటున్న మరో ముద్దుగుమ్మ!

palak-maheshప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇష్టపడని ముద్దుగుమ్మలు ఉంటారా? మరీ ముఖ్యంగా సినీ హీరోయిన్లు మహేష్ ను ఇష్టపడకుండా ఉంటారా? టాప్ హీరోయిన్ల నుండి వర్ధమాన తారల వరకు… దాదాపుగా అందరిదీ ఒకటే మాట… ‘ఒక్క సినిమాలో అయినా మహేష్ తో కలిసి నటించాలని!’ బాలీవుడ్ టు టాలీవుడ్… ఇండియాలో ఉన్న ఏ ‘వుడ్’లో అయినా హీరోయిన్లు ప్రిన్స్ నామస్మరణ చేయాల్సిందే!

తాజాగా ఈ జాబితాలో చేరింది… “అబ్బాయితో అమ్మాయి” హీరోయిన్ పల్లక్ లల్వాని. తన ఆల్ టైం అభిమాన హీరో మహేష్ బాబు అని, ఆయనతో కలిసి ఒక్క సీన్ లో అయినా నటించాలనేది తన అభిలాష అని పేర్కొంది పల్లక్. “అబ్బాయితో అమ్మాయి” ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించింది లల్వాని.

ఈ సినిమాలో చేసిన రొమాంటిక్ సీన్స్ ‘అభి – ప్రార్థన’ పాత్రల వరకే పరిమితమని, సినిమాలో ఇవన్నీ సాధారణమేనని చెప్తున్న ఈ ముద్దుగుమ్మ మాటలకు సినీ జనాలు నోరెళ్ళబెడుతున్నారట. మొదటి సినిమాతోనే ట్రేడ్ వర్గీయులను తన మాటలతో మాయ చేస్తోందని కితాభిస్తున్నారు పరిశీలకులు.

ADVERTISEMENT
Latest Stories