వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలతో పసునూరి దయాకర్ అన్న పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. 4,59,092 ఓట్ల భారీ మెజారిటీయే దీనికి కారణం. ప్రత్యర్ధి పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేస్తూ వరంగల్ వాసులు ఇచ్చిన తీర్పుతో అధికార పార్టీ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. దేశంలోనే అత్యంత భారీ మెజారిటీలో 7వ స్థానాన్ని దక్కించుకున్న పసునూరి దయాకర్, రాష్ట్ర నేతలకు సంబంధించి అయిదుగురు ప్రముఖ నేతల చెంత చేరాడు. పీవీ నరసింహారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ లు ఇప్పటికే టాప్ 10 జాబితాలో నిలువగా, తాజాగా దక్కిన విజయంతో పసునూరి కూడా వారి పక్షాన నిలిచాడు.
దేశంలో నమోదైన 10 భారీ విజయాలను పరిశీలిస్తే…
1. ప్రీతం ముండే – 6.92 లక్షలు – మహారాష్ట్ర (బీడ్) – 2014 – బిజెపి
2. అనిల్ బసు – 5.92 లక్షలు – పశ్చిమ బెంగాల్ (ఆరంగాబగ్) – 2004 – సీపీఎం
3. పీవీ నరసింహారావు – 5.80 లక్షలు – నంద్యాల (ఏపీ) – 1991 – కాంగ్రెస్
4. నరేంద్ర మోడీ – 5.70 లక్షలు – వడోదర (గుజరాత్) – 2014 – బిజెపి
5. వైయస్ జగన్ మోహన్ రెడ్డి – 5.45 లక్షలు – కడప (ఏపీ) – 2011 – వైఎస్సార్ సిపి
6. రామ్ విలాస్ పాశ్వాన్ – 5.04 లక్షలు – హాజపూర్ (యూపీ) – 1989 – జనతాదళ్
7. పసునూరి దయాకర్ – 4.59 లక్షలు – వరంగల్ (తెలంగాణా) – 2015 – టీఆర్ఎస్
8. రామ్ విలాస్ పాశ్వాన్ – 4.24 లక్షలు – హాజపూర్ (యూపీ) – 1977 – జనతాదళ్
9. వైయస్ రాజశేఖర్ రెడ్డి – 4.22 లక్షలు – కడప (ఏపీ) – 1991 – కాంగ్రెస్
10. కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి – 3.97 లక్షలు – మెదక్ (తెలంగాణా) – 2014 – టీఆర్ఎస్.





