ఎన్నికలకు భయపడే 2014లో పవన్‌ పోటీ చేయలేదట!

Pawan Kalyan afraid of elections in 2014జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోయినా టీడీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌పై పవన్‌ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిరాధారం అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు భయపడే 2014లో పవన్‌ పోటీ చేయలేదని విమర్శించారు

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ దయతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదని జనసేనానికు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటరిచ్చారు. పవన్ అంత బలం ఉంటే తన సొంత పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయాని ప్రశ్నించారు. పవన్ వల్లే టీడీపీ గెలిచిందని మాట్లాడడం సరికాదని, పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదా అంటూ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

బీజేపీ చెప్పినట్టు చేస్తున్నది నిజం కాదా అంటూ నిలదీశారు. అందరూ కలిసి సీఎం చంద్రబాబుపై దాడి చేస్తున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. మరోవైపు తాను ఎన్నికలలో గెలవకపోయినా తెలుగు దేశంను మాత్రం తప్పకుండా ఓడిస్తా అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories