జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత అమరావతిలో పర్యటిస్తున్నారు. వివిధ గ్రామాలు సందర్శించి అక్కడ రెండు నెలలుగా నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులకు అండగా ఉంటామని బీజేపీ మాట ఇచ్చింది.. రాజధాని ఎక్కడికీ తరలిపోదంటూ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
“మేము అందరి లాంటి వ్యక్తులం కాదు. మాట ఇస్తే మాట మీద నిలబడతాం,” అని చెప్పుకొచ్చారు ఆయన. మరోవైపు… రాయపూడి గ్రామంలో రైతులతో మాట్లాడుతున్న సమయంలో ఒక రైతు కూలీ ప్రభుత్వాన్ని ఆవేశంగా నిలదీసింది. “రాజధాని ఎస్సి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మారుస్తున్నావా జగనన్నా? బడుగు బలహీన వర్గాలు అంటే నీకు అంత చిన్న చూపు ఎందుకన్నా?, అంటూ ప్రశ్నించింది.
రాజధాని విస్తరించిన 29 గ్రామాలలో… 19 గ్రామాలూ ఎస్సి నియోజకవర్గమైన తాడికొండ కింద, మిగతా 14 గ్రామాలు జనరల్ నియోజకవర్గమైన మంగళగిరి కిందకు వస్తాయి. అహంకారం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు.. నష్టపోయింది రైతులే.. మీకు అండగా ఉండి పోరాడుతా అని పవన్ వారికి హామీ ఇచ్చారు.
“ఎక్కడ రాజధాని ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కానీ అమరావతి ఏపీ రాజధానిగా చెయ్యాలని నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అప్పట్లో మద్దతు తెలిపింది. రాజధాని అంశం ఒక సామాజికవర్గం సమస్య కాదు… రాజధాని కోసం రైతులు భూములు త్యాగం చేశారు.. టీడీపీపై కోపంతో రాజధానిని తరలించడమేంటి?,” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.





