పవన్ కళ్యాణ్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారట

Pawan Kalyan- back boneజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో నడుం నొప్పితో బాధ పడుతున్నారు. దాని వల్ల ఆయన సినిమాల్లో డ్యాన్సులు కూడా బాగా తగ్గించేశారు. గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు అది బాగా ఎక్కువైందట. ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు అన్నా పవన్ కళ్యాణ్ ఆ పని చెయ్యలేదట.

ఇప్పుడు కూడా ఆపరేషన్ జోలికి వెళ్లకుండా సహజ వైద్య పద్దతిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొన్ని రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట. వారం రోజుల్లో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్తతో పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

ADVERTISEMENT

మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి తిరిగి రావడంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2020 మొదట్లోనే ఆయన తన తదుపరి చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారని అంటున్నారు. దీనితో అభిమానులు కొత్త సంవత్సరం గురించి ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలు పెడితే జనసేన రాజకీయంగా నష్టపోవడం ఖాయం అంటున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిబద్దత మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దీనితో ఆయనను ప్రజలు సీరియస్ గా తీసుకోరు. ఓటీవలే జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు. జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో తన ఖాతా ఓపెన్ చేసింది. ఫలితాల అనంతరం పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో నిరాశా నిస్పృహలలో మునిగిపోయాయి.

ADVERTISEMENT
Latest Stories