దేవుడికి ద్రోహం చేస్తే… ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

Bandla - Ganesh Joins - Congress Partyబండ్ల గణేష్…. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే మనిషి పవన్ కళ్యాణ్. ఆడియో వేడుకల పైన, సినీ ఈవెంట్లలో పవన్ భజన చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన బండ్ల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే ఆ దేవుడు పెట్టిన రాజకీయ పార్టీలో చేరకుండా, నాడు దేవుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు బండ్ల.

ADVERTISEMENT

[m9ad]

గత కొన్నాళ్లుగా బండ్ల కదలికలు కాంగ్రెస్ వైపుకు ఉన్నాయన్న సంగతి బహిరంగమే గానీ, ఓ పక్కన తన దేవుడు పెట్టిన పార్టీలోకి వెళ్ళకుండా, కాంగ్రెస్ లో చేరడాన్ని బండ్ల ఎలా సమర్ధించుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అలాంటి సంజాయిషీలకు తావు లేకుండా కాంగ్రెస్ సమక్షంలో పార్టీలో చేరడమే కాదు, షాద్ నగర్ నుండి బరిలోకి దిగే విధంగా తొలి విడత జాబితాలోనే తన పేరు ఉండే విధంగా బండ్ల బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే పవన్ అభిమానుల నుండి మాత్రం బండ్లపై భారీ స్థాయిలో రియాక్షన్స్ వస్తున్నాయి. పవన్ కు అత్యంత సన్నిహితుడిగానే కాక, నమ్మకస్తుడిగా బండ్ల జనసేనకు అండగా ఉంటారనుకుంటే, ఇలా మిత్రద్రోహం చేస్తారనుకోలేదంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫైనల్ గా… అభిమానం వేరు…. రాజకీయం వేరు…. వర్తమాన పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి… దానిని పవన్ ఫ్యాన్స్ జీర్ణం చేసుకోవాలంతే..!

ADVERTISEMENT
Latest Stories